![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -644 లో.... ఆస్తుల్లో మా వాటాలు మాకిచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటూ ధాన్యలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. నా మాటకి విలువ లేనప్పుడు.. నా ఆస్తులు ఎందుకని సీతారామయ్య ముక్కుసూటిగా మాట్లాడతాడు. అంటే మీ వారసుల గురించి ఆలోచించరా అని ధాన్యలక్ష్మి అనగానే.. మాటకి విలువ ఇవ్వనివారు ఎలా వారసులు అవుతారని ఇందిరాదేవి అంటుంది. రాజ్ నువ్వు ఆస్తులు అమ్మి ఆ అప్పు కట్టు అంటూ రాజ్ కి సీతారామయ్య చెప్తాడు.
పేపర్స్ అన్ని లాకర్ లో ఉన్నాయ్ రేపు సబ్ మిట్ చేస్తానని రాజ్ అనగానే.. సరే రేపు వస్తామంటూ బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు. మనిషికో దారిని చూసుకుందామంటూ రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రుద్రాణి, రాహుల్ లు బయట కూర్చుని అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి అన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకొని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి రుద్రాణి చేతిలో ఒక గిన్నె పెట్టి ఇప్పుడు మీ సిచువేషన్ ఇదే అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ముష్టి ఎత్తుతున్నట్లు ఉహించుకోండి అనగానే ఇద్దరు ఆడుక్కున్నట్టు ఉహించుకొని టెన్షన్ పడతారు. మరొకవైపు ప్రకాష్, సుభాష్ ఇందిరాదేవి, అపర్ణ లు మాట్లాడుకుంటారు. ప్రకాష్ పూర్తిగా ధాన్యలక్ష్మి చెప్పినట్టు వింటున్నాడని ఇందిరాదేవి, అపర్ణ లు అంటుంటారు. ప్రకాష్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ మారేలా లేడని ఇందిరాదేవి బాధపడుతుంది.
రాజ్, కావ్యలు ఇంట్లో జరిగిన దానికి బాధపడుతుంటారు. మరొకవైపు కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని సీతారామయ్య ఇందిరదేవితో చెప్తూ బాధపడతాడు. అప్పు స్టేషన్ లో ఉండగా కళ్యాణ్ తనకి క్యారేజ్ తీసుకొని వస్తాడు. దాంతో అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |